సిరివెన్నెల మరణంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం యావత్ సినీలోకాన్ని శోఖ సంద్రంలో ముంచింది. నవంబర్ 24న అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం పూట ఆయన మరణించారు.  ఆయన హఠాత్మరణాన్ని సాహిత్య ప్రియులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తమ మధ్యలో ఉండీ.. మరణించడం చాలా మంది సినీ ప్రముఖులను కంటతడిపెట్టిస్తుంది. సిరివెన్నెల మరణంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య, సినీ అభిమానుల్లో విషాద ఛాయలు నింపాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిరివెన్నెల మరణంపై సంతాపాన్ని ప్రకటించారు.

ట్విట్టర్ లో సీఎం జగన్ ’’ తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు.సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.‘‘ అంటూ సంతాపాన్ని తెలియజేశారు.