వాస్తు: ఇంట్లో వీటిని తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే అన్నీ ఇబ్బందులే ఉంటాయి..!

-

వాస్తుని అనుసరిస్తే శుభమే కలుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఎటువంటి సమస్యలు కలగకుండా ఆనందంగా ఉండాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. మరి ఆలస్యమెందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం.

 

vasthu for home

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ముందు ఉండే రోడ్డు కంటే కూడా మీ ఇల్లు ఎత్తులో ఉండాలి లేదంటే సమానమైన ఎత్తులో ఉండాలి. అంతే కానీ రోడ్డు కంటే కూడా కిందకి ఇళ్ళు ఉండకూడదు. ఒకవేళ కనుక ఇలా ఉంటే సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

అదే విధంగా ఇంట్లో పచ్చటి మొక్కలు ఉంటే ఇంటికి చాలా మంచిది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లు ఇంట్లో ఉండకూడదు. కాబట్టి మరీ పెద్ద పెద్ద చెట్లను ఇంట్లో ఉంచకండి.
అలానే ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇలాంటి మొక్కల్ని నాటొద్దు.
ఇంట్లో మురికి నీరు ఎప్పటికప్పుడు వెళ్లి పోయేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కనుక నీరు అలా నిల్వ ఉండిపోతే దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని కారణంగా సమస్యలు ఎక్కువ అవుతాయి అని గ్రహించండి.
అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎలక్ట్రికల్ పోల్స్ ఇంటి బయట ఉండకూడదు. వీటి వల్ల సమస్యలు వస్తాయి. అలానే కష్టాలు పెరుగుతాయి. కాబట్టి ఈ తప్పులు ఏమీ లేకుండా చూసుకోండి దీంతో ఆనందంగా ఉండొచ్చు ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news