హిందూ సంప్రదాయంలో దీపం పెట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెట్టే దీపాల లెక్కను బట్టీ వాటి అర్థాలు మారిపోతాయి. ఎటువైపు పెట్టాలి, ఎన్ని ఒత్తులువేయాలి, ఏం ఆయిల్ వేయాలి.. నువ్వుల నూనెతో వెస్తే కలిగే ప్రయోజనాలు వేరు, ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకొన్ని అర్థాలు.. ఇలా దీపం పెట్టడంలో ఎన్నో నిగూడ అర్థాలు దాగి ఉన్నాయి.. మీరు పిండితో చేసిన దీపం గురించి వినే ఉంటారు. ఇలా పిండి దీపాల వెనుక కూడా ఒక పెద్ద కారణమే ఉంది. జ్యోతిషశాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనదిగా వర్ణించబడింది. ఇది జీవితంలోని అతి పెద్ద సమస్యలను కూడా అధిగమించగలదట… పిండి దీపం వెలిగించడం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే మార్గాల్లో ఒకటని పండితులు అంటారు.. పిండి దీపం వెలిగించే సరైన మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం.!!
ప్రత్యేక పరిస్థితుల్లోనే పిండి దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా కోరికలు తీర్చుకోవటం కోసం పిండి దీపాలు వెలిగిస్తారట.. దీని కోసం ఎల్లప్పుడూ పిండి దీపాల సంఖ్యను తగ్గించడం, పెంచడం చేస్తుంటారు. ఉదాహరణకు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10 దీపాలు, చివరి రోజు 1 దీపం మాత్రమే వెలిగించాలి. మీరు 1 దీపంతో వెలిగించడం ప్రారంభించినట్లయితే చివరి రోజున 11 దీపాలతో ముగిస్తారు. ఇది కాకుండా మీ కోరిక ప్రకారం ఇష్ట దైవం ముందు దీపం వెలిగించవచ్చు..
ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలనుకునే వారు, సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి ముందు తీర్మానం చేసి, 11 రోజుల పాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగిస్తే… దీని కారణంగా, కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల ఉంటుందని పండితులు చెబుతున్నారు..
పిండిలో పసుపు కలిపి దీపం చేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట… దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది.
అప్పుల బాధతో బాధపడుతుంటే, బజరంగ్ బలి ముందు పిండి దీపం వెలిగించండి.. దీంతో ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పదే పదే ధన నష్టం వస్తే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి. అన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట..అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు కొలువుదీరతాయి.
జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవనూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి.
సో..పిండి దీపం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయనమాట.. వీటిమీద నమ్మకం ఉన్నవారు ప్రయత్నించవచ్చు.. ఈ సమాచారం అంతా మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు, అధ్యయనాలు ఏం లేవని గమనించగలరు.