జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది. ట్రాన్స్ ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్ ఫర్ చేసారు. అంటే టీడీపీ కుట్రలో మనం కూడా భాగం అయ్యామని అనిపిస్తోంది. వాస్తవాలు చెప్పేందుకు NCLT నీ జగన్ ఆశ్రయించారు. అంతే తప్ప తల్లి, చెల్లి పై కేసులు వేయాలని దురుద్దేశం మాత్రం కాదు. NCLT లో పిటిషన్ వేయకపోత్ మళ్ళీ ఇదే టీడీపీ నేతలు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారు. షర్మిల కు మేలు చేయాలని ప్రేమ అభిమానంతో మాత్రమే జగన్ MOU చేశారు. కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుని సంతకాలు చేశారు.
జగన్ సొంత ప్రాపర్టీలు అని స్పష్టంగా డాక్యుమెంట్స్ లో ఉంది. ఆస్తుల పెంచటంలో షర్మిల పాత్ర ఎక్కడా ఉన్నట్టు నాకు తెలియదు. ఆస్తుల్లో షర్మిల వాటా ఉంటే ఈఢీ ఎందుకు షర్మిలపై కేసులు పెట్టలేదు. కేవలం జగన్ పై మాత్రమే కేసులు ఈడీ పెట్టింది. డివిడెండ్ గా 200 కోట్లు ఇచ్చారని షర్మిల అనటం సరికాదు. సంస్థలో డైరెక్టర్ గా ఉన్న జగన్ చెల్లి షర్మిలకు ఇచ్చినది తప్ప డివిడెండ్ కాదు. జగన్ సంస్థల్లో సమాన వాటాలు ఇవ్వాలని వైయస్ఆర్ అనుకుంటే అప్పుడే షర్మిల లేదా ఆమె భర్త అనిల్ లను డైరెక్టర్ గా పెట్టేవారు కదా. వైఎస్సార్ చెప్పి ఉంటే జగన్ వారి పేర్లు పెట్టే వారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.