వాస్తు: బిజినెస్ బాగుండాలంటే ఆఫీసులో ఈ మార్పులు చెయ్యండి..!

-

మీ బిజినెస్ బాగుండాలంటే ఈ విధంగా పాటిస్తే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎంతో కష్టపడినా అనుకున్నంత సాధించలేకపోతున్నారు. ఎంత ఎదురు చూసినా అనుకున్నంత ఆదాయం పొందలేకపోతున్నారు. అయితే మీరు మీ బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది.

ఈ వాస్తు చిట్కాలుని కనుక మీరు పాటించారు అంటే మీ బిజినెస్ అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి. ఈ రోజు వాస్తు పండితులు ఆఫీస్ కి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలు చెప్పారు. ఎకౌంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఆఫీసు లో ఉంచుకోవడం మంచిదని చెప్పారు.

ఈ దిక్కులో ఉంచుకోవడం వల్ల చాలా మంచి కలుగుతుందని, మంచి ఆదాయం పొందవచ్చని చెప్పారు. అలానే మీ ఆఫీసులో ఈశాన్యం వైపు దేవుడి మండపం పెట్టుకోవడం మంచిదని.. దీని వల్ల పాజిటివిటీ ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది.

అదే విధంగా మీరు దేవుడు పటాలు పట్టాలంటే నైరుతి వైపు పెట్టుకోవడం మంచిదని దీనివల్ల కూడా మీకు మంచి ఇంపాక్ట్ పడుతుందని చెప్పారు. అదే ఒకవేళ మీరు ఆఫీస్ లో ఓవెన్ లాంటివి ఏమైనా పెట్టుకుని ఆహారం తయారు చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఈశాన్యం వైపు వాటిని పెట్టుకుంటే మంచి కలుగుతుందని చెప్పడం జరిగింది.

మంచి నీళ్లని ఉత్తర దిక్కులో పెట్టుకుంటే మంచిది. ఇలా ఆఫీస్ లో ఈ మార్పులు చేస్తే మీ బిజినెస్ బాగుంటుందని అనుకున్నంత ఎత్తుకు ఎదుగుతారని పండితులు చెప్పారు కనుక మంచి బిజినెస్ కోసం ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించండి. తద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండచ్చు. బిజినెస్ కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version