వాస్తు: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఈ దిక్కులో అద్దాలని పెట్టండి….!

చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సామాన్లనని ఉంచితే మంచి కలుగుతుంది. ఈరోజు వాస్తు పండితులు మన కోసం కొన్ని వాస్తు టిప్స్ ని చెప్పారు మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా వీటి కోసం చూడండి. సాధారణంగా మన ఇంట్లో అద్దాలు ఉంటాయి.

ఏ దిక్కులో అద్దాలు ఉంచితే మంచిది..?, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..?, ఎటువంటి ఇబ్బందులు మనకి రావు..? ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అద్దాలని డైనింగ్ రూమ్ లో పెట్టడం వల్ల మంచి కలుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు. పెద్ద అద్దాన్ని డైనింగ్ రూములో ఉంచడం వల్ల చక్కటి ప్రయోజనాలని పొందవచ్చని నిజంగా ఇది మంచి ఎనర్జీ ఇస్తాయి అని చెప్తున్నారు.

అదృష్టాన్ని కూడా ఇవి మనకి తీసుకు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. డైనింగ్ టేబుల్ కుడిపక్కన పెద్ద అద్దం ఉంటే ఆహారం తీసుకునేటప్పుడు మంచిగా ఉంటుందని ఆకలి ఎక్కువగా ఉంటుందని అదే విధంగా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు. దీని ద్వారా ఇంట్లో సంతోషం కూడా ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు.

కాబట్టి డైనింగ్ రూమ్ లో ఇలా అద్దాన్ని ఉంచితే ఆనందం, ఆరోగ్యం కూడా అని గుర్తుంచుకోండి. దీనితో పాటుగా వంట గది లో పడమర వైపు ఉండేలాగ గుండ్రంగా ఉండే అద్దాన్ని అమర్చడం మంచిది. అంటే తూర్పు గోడ కి అద్దం ఉండాలి. ఇలా ఉండడం వల్ల వంటింట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ విధంగా అద్దాలని పెట్టుకోండి. దీనితో మీకు అంతా మంచే జరుగుతుంది