వాస్తు: ఇలా ఆర్ధిక సమస్యలకి చెక్ పెట్టేయండి..!

ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సమస్యలు ఉండవు. చాలా మంది ఇళ్లల్లో అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం, ధన నష్టం కలగడం లాంటివి. అయితే ఇలాంటి సమస్యలు మీ ఇంటి నుండి దూరం అయి పోవాలంటే ఖచ్చితంగా పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన టిప్స్ మీకు బాగా పనిచేస్తాయి. అయితే మరి ఇక ఆలస్యం చేయకుండా పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం.

 

ఇంట్లో జపం చేసుకోవడం చాలా ముఖ్యం. జపం చేయడం వల్ల ధనం వస్తుంది. అలానే పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉంటుంది. అయితే జపం చేయడం ఎంత ముఖ్యమో ఏ దిక్కులో కూర్చుని చేయడం అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. జపం చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చుని చేయండి.

కొన్ని కొన్ని సార్లు వీలు లేనప్పుడు ఇతర దిక్కుల్లో కూర్చుని చేయడం కూడా మంచిదే. పడమర వైపు కూర్చుని జపం చేయడం వల్ల మీరు అనుకున్నంత ధనం పొందొచ్చు. అలానే దక్షిణ వైపు కూర్చుని మీరు జపం చేస్తే కూడా చాలా మంచిది. అలానే వాయువ్యం వైపు కూర్చుని జపం చేస్తే శత్రువులు బాధ నుండి విముక్తి పొందవచ్చు.

అదే ఆగ్నేయం వైపు కూర్చుని జపం చేశారు అంటే మీ యొక్క అందం పెరుగుతుంది అలానే ఇతరులని మీరు ఈజీగా ఆకర్షిస్తారు. కాబట్టి మీరు ఈ సమస్యల నుండి బయట పడడానికి జపం బాగా ఉపయోగ పడుతుంది. అలాగే ఈ దిక్కులో కూర్చొని చేసుకోండి. దీంతో ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండచ్చు.