వాస్తు: పాజిటివిటీ, నమ్మకం పెరగాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

ఏదైనా సమస్య వున్నా.. నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నా.. ఈ వాస్తు టిప్స్ ని ఫాలో అవ్వండి. ఈ రోజు మనతో పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. వీటిని తప్పకుండా ఫాలో అయ్యారు అంటే తప్పక మీపై మీకు నమ్మకం కలుగుతుంది. అలానే పాజిటివిటీ కూడా పెరుగుతుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ వాస్తు టిప్స్ గురించి ఇప్పుడే చూసేయండి.

వాస్తు / vastu

కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే ఇబ్బందులు రావడం… ఏదో ఒక సమస్య కలగడం లాంటివి జరుగుతాయి. అటువంటి సమయంలో మనం ఎంతో ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు ఖాళీగా ఉన్న గోడ గురించి పండితులు చెప్పడం జరిగింది. ఇంట్లో ఉండే ఖాళీ గోడ వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుందని… ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నెగటివ్ ఆలోచనలు విపరీతంగా వస్తాయని దీంతో మెదడు అంతా కూడా పిచ్చెక్కి పోతుందని… ఇది అస్సలు మంచిది కాదని ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి అని పండితులు అంటున్నారు.

అయితే మీరు ఆఫీస్ నుండి కానీ లేదా బయటికి వెళ్లి కానీ వచ్చినప్పుడు ఖాళీగా ఉండే గోడ దగ్గర కూర్చుంటే అది మిమ్మల్ని మరింత ఇబ్బందికి తీసుకు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఖాళీగా ఉండే గోడకి ఎదురుగా కూర్చోవద్దు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఆలోచనలు వస్తాయి. ఇలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కుటుంబసభ్యులు ఫోటోలు కానీ అందమైన పెయింటింగ్స్ లాంటివి కానీ పెట్టండి. ఇలా కనుక చేశారు అంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది.