వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

-

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి ఇంటి వద్ద వాతావరణం బాగుండాలి. అలా ఉంచడానికి పెద్దలు తమ వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే పిల్లల చదువు బాగుంటుంది. ముందుగా పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక గది ఉంటే మంచిది. లేదంటే హాల్లో కూర్చుని చదువుకుంటుంటే అక్కడే టీవీ ఉంటుంది. అది చదువుకి భంగం కలిగిస్తుంది.

ఒకవేళ ఇల్లు చిన్నగా ఉందనుకున్నప్పుడు హాలునే చదువుకునే గదిలా మార్చుకోవచ్చు. ఇక టాపిక్ కి వస్తే, చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు ఉండాలి? ఎలాంటి రంగులు మనసు మీద ప్రభావం చూపి చదువు మీద ఆసక్తి కలిగేలా చేస్తాయి అన్న విషయాలు చర్చిద్దాం. ముందుగా స్టడీ రూమ్ లో లైట్ కలర్స్ వాడాలి. మీరే కలర్ తీసుకున్నా లైట్ కలర్ అయితే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. చిక్కగా ఉన్న రంగులు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. అందుకే వాటి జోలికి వెళ్ళవద్దు.

క్రీమ్ కలర్, లైట్ పర్పుల్, ఆకాశ నీలం, లేత ఆకుపచ్చ, లేత పసుపు పచ్చ, బాదం రంగు, గోధుమ రంగులు బాగుంటాయి. ఇవి మనసు మీద మంచి ప్రభావాన్ని చూపి చదువు మీద మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా పసుపు పచ్చ రంగు చాలా బాగుంటుంది. అందుకే పిల్లలు చదువుకునే గదిలో ఇలాంటి రంగులు వాడడమే సరిగ్గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news