కాలివేళ్ల ఆకృతిని బట్టి మీ భవిష్యత్‌.. జీవిత భాగస్వామి, ఆదాయాలు ఎలా ఉంటాయంటే..?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితాన్నే అంచానా వేస్తారు మన పండితులు. ఆ వ్యక్తి క్యారెక్టర్‌ ఏంటి, జీవితం ఎలా ఉంటుంది, అదృష్టం ఉందా లేదా, దోషాలు ఉన్నాయా ఇలా ఏ టూ జెడ్‌ చెప్పేస్తారు. అయితే వీటిని కొందరు నమ్ముతారు. మరికొందరు కొట్టిపారేస్తారు. మీరు నమ్మినా నమ్మకున్నా..సైన్స్‌కు జ్యోతిష్యశాస్త్రానికి కొంచెం సంబంధం ఉంది. సైన్స్ ప్రకారం కొన్ని నిరూపించబడ్డాయి..మరికొన్ని వాటికి ఆధారాలు లేవు.

ఆచారాలకు, పండితులు చెప్పేవాటికి సైన్స్‌ ద్వారా కారణాలు ఏంటి అని అన్వేషించినప్పుడు మనకు కొన్ని నమ్మాలనిపిస్తుంది. అయితే ఈరోజు చెప్పేవాటికి సైన్స్‌ ప్రకారం సమాధానం అయితే మా దగ్గర ప్రస్తుతానికి లేదు. కాలివేళ్ల ప్రకారం..ఆ వ్యక్తి బలం, బలహీనత, ప్రవర్తన, జీవిత భాగస్వామి గురించి సాముద్రిశాస్త్రం ప్రకారం చెప్పేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మీ బొటనవేలు, పక్కన వేలు సమానంగా ఉంటే ఆ వ్యక్తులు చాలా సంతోషంగా, ధనవంతులుగా ఉంటారట. వారు తెలివైన జీవిత భాగస్వామిని పొందుతారు. దీని కారణంగా వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి బంధువుల నుంచి ఎంతో సహకారం లభిస్తుంది.

2. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒకరి బొటనవేలు పక్కవేలుతో అతుక్కొని ఉంటే అతను చాలా పోరాటం తర్వాత జీవితంలో అన్నింటిని పొందుతాడు.

3. బొటనవేలు పక్కన ఉన్నవేలు పెద్దదిగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులట.. వారి జీవిత భాగస్వామి కూడా చాలా తెలివైనవారే వస్తారు..డబ్బు పొదుపు చేయడంలో ఇద్దరు సిద్దహస్తులే.

4 .రెండో వేలు కంటే మూడో వేలు పెద్దదిగా ఉంటే అతను చాలా ప్రశాంతంగా, సాధారణ స్వభావం కలిగి ఉంటాడని అర్థం.. అటువంటి వ్యక్తి నుంచి ఎవరైనా నిజాలు తెలుసుకోగలరు. వారి సరళత కారణంగా ఈ వ్యక్తులు చాలాసార్లు మోసపోయే ప్రమాదం ఉంది.

5. ఐదు వేళ్లు ఒకేలా ఉంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. గౌరవప్రదమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో చాలా ఆనందం, సంపద, గౌరవం పొందుతారు.

గమనిక : జ్యోతిష్యశ్రాస్తం ప్రకారం మాత్రమే ఇది మీకు అందించటం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆసక్తిమేరకు ఇచ్చిన కథనం అని గ్రహించగలరు. నమ్మటం, నమ్మకపోవటం అనేది మీ ఇష్టం.