ఆగస్టు 23 శని అమావాస్యలో తప్పక చేయాల్సిన పూజలు..

-

శ్రావణమాసం వచ్చే అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ఓ ప్రత్యేకత ఉంది. అందులోనూ అమావాస్య శనివారం నాడు వస్తే విశేషంగా భావిస్తారు భక్తులు. మరి ఆగస్టు 23వ తేదీ శనివారం రోజు అమావాస్య తిధి కలిసి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజు శని అమావాస్యగా పిలుస్తారు.ఈ అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి. ఆరోజు చేయవలసిన పూజల గురించి తెలుసుకుందాం..

అమావాస్య తిధి శనివారంతో కలిసినప్పుడు ఆరోజు ఎంతో పవిత్రవంతమైన శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శని దేవునికి పూజలు, దానాలు చేసి పాప విమోచనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శని ప్రభావం తగ్గి శుభ ఫలితాల కోసం శని దేవుని పూజించడం అలాగే ఆంజనేయ స్వామిని, ఈ రోజున వెంకటేశ్వర స్వామిని కొలవడం వలన సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

ఏ రోజు అమావాస్య :ఈ శని అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే రావడం జరుగుతుంది. ఈ రోజు శని గ్రహ దోషం తో బాధపడే వారందరూ శని దేవుని పూజించడం శని దేవుని ఆశీస్సులు పొందడానికి ఈరోజు శక్తివంతమైంది గా భావిస్తారు. ఇక అమావాస్య తిధి ఆగస్టు 22వ తేదీ ఉదయం 11:35 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ ఉదయం 11:30 ముగుస్తుంది. అయితే శని అమావాస్య చేయవలసిన పూజలు ఆగస్టు 23వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.

Must-Do Rituals on Shani Amavasya – August 23
Must-Do Rituals on Shani Amavasya – August 23

శని దేవునికి పూజ : శని అమావాస్య రోజున శని దేవుని ఆలయాన్ని సందర్శించి, శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చాలా శుభప్రదం. నువ్వుల నూనెలో బెల్లం కలిపి అభిషేకం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి.

నల్లని వస్తువులు దానం: శని అమావాస్య రోజున శనిదేవునికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు నల్లని చెప్పులు వంటివి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని దేవుడి ప్రసన్నమవుతాడని భావిస్తారు ముఖ్యంగా శని బాధలు ఉన్నవారు ఈ దానాలు చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

హనుమాన్ చాలీసా పారాయణ : శని అమావాస్య రోజున శనిదేవుని బాధల నుండి ఉపశమనం పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా శక్తివంతమైన మార్గం శని అమావాస్య రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి.

వెంకటేశ్వర స్వామి పూజ: శనివారం రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయడం శుభప్రదం. వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన పిండి దీపారాధన చేసి, నువ్వుల లడ్డు నివేదన చేయడం వలన శని దోషాలు తగ్గి కుటుంబంలో సుఖ శాంతులు పెరుగుతాయి.

ఇక ఇంతే కాక శని అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం, వలన వారి ఆత్మకు శాంతి లభిస్తుంది. దీనివల్ల పితృ దోషాలు తొలగి కుటుంబం సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇక అంతేకాక పేదవారికి, నిస్సహాయులకు భోజనం పెట్టడం అన్నదానం చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శని అమావాస్య రోజున ఈ పూజలు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభించి జీవితంలో ఎదురయ్యే కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి.

గమనిక:పైన చెప్పినవి సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా సూచించినవి మాత్రమే, శాస్త్రీయమైన ఆధారాలు లేవు నమ్మకం వ్యక్తిగతం.

Read more RELATED
Recommended to you

Latest news