కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో చుక్కెదురు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లకు హైకోర్టులో చుక్కెదురైంది. కేసీఆర్, హరీశ్ రావు మధ్యంతర ఉత్తర్వులు అడిగారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు నిరాకరించింది. కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని ఏజీ స్పష్టం చేశారు. ఘోష్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించిన తరువాత తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

dede
dede

పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీశ్ రావుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మరోవైపు మరో నాలుగు వారాల పాటు హైకోర్టు తదుపరి విచారణను  వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ పై ఘోష్ రిపోర్టును అసెంబ్లీలో ఎప్పుడూ ప్రవేశపెడతారనే విషయం ఇప్పుడు చర్చకు దారితీయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news