ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం గా పేరుగాంచిన, దక్షిణ భారత దేశంలోనే అతి పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం. ఈ ఆలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారత దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. విష్ణువు కి ఎంతో ప్రీతికరమైన 108 దేవాలయాల్లో ఒకటి. తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో ఉన్న శ్రీ రంగం అనే గ్రామం లో రంగనాథుడు కొలువై ఉన్నాడు.
ఈ ఆలయానికి దృడమైన, భారి గోడలు కలిగిన ఏడు ప్రహరీలు ఉన్నాయి. ఆలయ గర్భ గుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లోను ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను తెలియచేస్తుంది. శ్రీ రాముడు లంకలో రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవుతాడు. తరువాత విభీషణుడు శ్రీ రాముడిని వదిలి లంకకు వెళ్ళలేక పోతుంటే శ్రీ రామచంద్రుడు శ్రీ రంగనాథుని దివ్య మూర్తిని ఇచ్చి తాను ఎప్పుడు నీ వెంటే ఉంటానంటాడు
.విభీషణుడు రంగానాధునితో తిరిగి వెళుతుంటే సంధ్యా సమయం కావాడంతో స్వామిని కావేరి నదుల మద్య ఉన్న ప్రాంతంలో ఉంచి సంధ్యా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చి చూసే సరికి శ్రీ రంగనాథుడు ప్రణవాకార, విమాన రూపంలో ప్రతిష్టం అవుతాడు. అది చూసి విచారించిన విభీషణుడికి రంగనాథుడు ప్రత్యక్షమై రాత్రి సమయంలో నీ పూజలు అందుకుంటానని వరమిస్తాడు. ఆ రకం గా శ్రీ రాముని చే ఆవిష్కరించబడిన దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం.