లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే.. ఇంట్లో ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండాల్సిందే..

-

డబ్బులు లేకుండా ఏ పని కూడా జరగదు.. పుట్టుకకు, చావుకు కూడా ఖచ్చితంగా డబ్బులు ఉండాలి.. కొంతమంది ఎంతగా డబ్బులు సంపాదించిన చేతిలో నిల్వదని బాధపడుతుంటారు..అయితే కొంతమంది సంపాదించిన డబ్బుతో మరింత ఎక్కువ మొత్తం సంపాదిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు..కొంతమంది ఎంత కష్టపడినా పక్కవాళ్లకు ఉన్న స్థాయిలో సంపాదన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన సంపాదనను ఐదు భాగాలుగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ దేవి ఎప్పుడూ మనతో ఉంటుంది.. ఏం చెయ్యాలో ఇప్పుడో వివరంగా తెలుసుకుందాం..

మనం పదిరుపాయలు సంపాదిస్తే అందులో అర్ద రూపాయి వేరేవారికి దానం చెయ్యడం మర్చిపోకండి..అలా దానం చేసిన విషయాన్ని పదే పదే చెప్పుకోవడం కూడా మంచిది కాదు..మిగిలిన డబ్బులో కొంత మొత్తాన్ని పేదల కోసం, అనాథల కోసం, దేవాలయాల కోసం ఖర్చు చేయవచ్చు. మిగిలిన డబ్బులో కొంత మొత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాలి.. భవిష్యత్ లో మనకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని పొదుపు చెయ్యడం మంచిది.

ఇక మిగిలిన డబ్బును కుటుంబం, పిల్లల కోసం ఖర్చు చేయాలి. మన సంపాదనను ఈ విధంగా ఖర్చు చేస్తే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.. లక్ష్మీదేవి నవ్వుతూ ఉన్న పటాన్ని పెట్టుకోవడం మంచిది..లోహాలు, బంగారంతో తయారు చేసిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కూడా ఆర్థికంగా బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ను ఉంచడం ద్వారా కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మన పై అమ్మవారి కటాక్షం ఉంటుంది.. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఈరోజు ఇల్లు శుభ్రంగా చేసి పెద్ద ముగ్గు వేసి తలస్నానం చేసి ముగ్గు పెట్టడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news