కన్యరాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

-

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం కన్యరాశి రాశిఫ‌లాలు

ఉత్తర- 2,3,4 పాదాలు హస్త- 1,2,3,4 పాదాలు
చిత్త -1,2 పాదాలు
ఆదాయం-11 వ్యయం-5
రాజపూజ్యం-4 అవమానం-5

ఈరాశివారికి గురువు ఉగాది నుంచి ఏప్రిల్ 22 వరకు, తిరిగి నవంబర్ 4 తర్వాత ధనుస్సులో చతుర్థస్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల చక్కటి ధనలాభం ఉంటుంది. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 మధ్య వఋశ్చికరాశిలో మూడోస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో సోదరసహకారాలు, తలచిన కార్యలు చేస్తారు. అంతేకాకుండా విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆకస్మిక లాభాలను పొందుతారు. ఇక శని ధనస్సు అంటే నాల్గింట ఉండుట వల్లన పెద్దప్రమాదాలు లేకపోయినా ప్రతి పనికి కష్టపడాల్సి ఉంటుంది. వాహనాలతో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహు దశమస్థానంలో ఉంటాడు దీంతో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక కేతువు ప్రభావం కొంత ఇబ్బందిగా ఉంటుంది. దగ్గరివారు దూరమయ్యే సూచనలు ఉన్నాయి.

Ugadi Panchangam 2019 Kanya Rashi Rashi Phalalu

ఈ రాశివారి గ్రహపరిశీలనతో ఫలితాలు.. ఈ ఏడాది సామాన్యంగా ఉన్నది. ఆటంకాలు ఉన్నా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో, సోదర వర్గంతో సఖ్యత, ఆర్థిక వ్యవహారాలు చక్కబడుతాయి. పుత్ర సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. లాభనష్టాలు సమానంగా సాగుతాయి. వ్యవసాయదారులకు కొత్త పంటలు వేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు శ్రమచేత ఫలితాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగంలోనివారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు చేసే పనికి న్యాయం చేస్తారు, సంతఋప్తిగా ఉంటారు. కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తాము చేసే పనుల్లో సంతఋప్తి కలుగుతుంది.

చైత్రమాసంలో ఫలితాలు మిశ్రమంగా వుంటాయి. ముఖ్యమెన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిం-చడం అన్ని విధాలుగా మంచిది. ఖర్చులకు తగిన రాబడి వుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వైశాఖ మాసంలో మొదటి రెండు వారాలు మామూలుగా వున్నా చివరి రెండు వారాలు లాభదాయకంగా వుంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. సలహాలు స్వీకరించడం మూలంగా మంచి ఫలితాలను పొందే అవకాశాలు బాగా వున్నాయి. జ్యేష్టమాసంలో శని, కేతువులు ప్రతికూ-లంగా వున్నారు. మిగతా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రారంభించిన కార్యాలు సకా-లంలో పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆషాఢంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు రోజు చేసే క్రయవిక్రయాలలో లాభాలు వుంటాయి. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. శ్రావణమాసంలో చేసే వృత్తిలో, వ్యాపారంలో అనుకూలత. పెట్టుబడుల వలన లాభాలు. అన్ని విషయాలలోనూ తలదూర్చ-కుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ల-డము చాలా మంచిది. భాద్రపద మాసంలో మొదటి రెండు వారాలు ప్రతికూలంగా వుంటుంది. ప్రారం-భించిన పనులలో ఆటంకాలు. వాహనముల విష-యమై అనవసరమైన ఖర్చులు. వ్యాపారస్తులు రోజు చేయు వ్యాపారములలో ఇబ్బందులు.

అధిగమించ-డానికి కొంత ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఆశ్వీ-యుజ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించడం అవసరం. ప్రతి విషయంలోనూ మెలకువ, చురుకుదనం అవసరం. కార్తీకంలో ముఖ్యమెన గ్రహాల మిశ్రమ సంచారం వలన పనులలో ఆటంకాలు వచ్చినా చివరిగా అను-కూల ఫలితాలను పొందుతారు. మార్గశిర మాసంలో మొదటి రెండు వారములు సామాన్యంగా వుంటాయి. చివరి రెండు వారములు అనుకూలంగా వుంటాయి. పనులలో ఆలస్యము. ఆరోగ్య సమస్యల మూలంగా పనులలో శ్రద్ధ కనబరచక పోవడము.

పౌష్య మాసంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు. పనులు సకాలంలో కాకపోవడంతో మానసిక అధై-ర్యము. అనవసరమైన ప్రయాణాలు. రావలసిన డబ్బు సకాలంలో అందక పోవడంతో తాత్కాలికంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వుంటుంది. మాఘ మాసంలో శని అర్ధాష్టమ స్థానం నుండి పంచమ స్థానంలోకి మారుతున్నాడు. కొంతవరకు శని ప్రభావం తగ్గుతున్నది. పనులలో ఆలస్యము వీడు-తుంది. ఆటంకాలు కొంతవరకు దూరమవుతాయి. ఫాల్గుణ మాసంలో కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశము. విద్యార్థులు ప్రణాళికా బద్దంగా శ్రమించి ముందుకు వెళ్లాలి. సత్ఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు. చిన్న చిన్న ఇబ్బందులు.

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
వృషభం
మిథునరాశి
కర్కాటకం
సింహం
కన్య
తుల
వృశ్చికం
ధనుస్సు
మకరం
మీన‌రాశి
కుంభరాశి

Read more RELATED
Recommended to you

Exit mobile version