తులారాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

-

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం తులారాశి రాశిఫ‌లాలు

చిత్త-3,4 పాదాలు స్వాతి- నాలుగు పాదాలు విశాఖ-1,2,3 పాదాలు
ఆదాయం-8 వ్యయం-8
రాజపూజ్యం-7 అవమానం-1

ఈరాశివారికి గురుసంచారం వత్సరాది నుంచి ఏప్రిల్ 22 వరకు, తిరిగి నవంబర్ 4 నుంచి ధనస్సులో మూడింట ఉంటాడు. దీంతో సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 మధ్య ద్వితీయంలో గురువు ధనబాధలు తొలిగిస్తాడు. మంచి వారితో స్నేహంచే విలువలు పెరుగుతాయి. ఇక శని ధనస్సులో మూడోస్థానంలో ఉంటాడు. దీనివల్ల బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలను దీర్ఘకాలికమైనవై ప్రయోజనాలు అందించడంలో శని బాగా ఉపకరిస్తాడు. ఇతరులకు మీ సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. జనవరి 24 తర్వాత నాల్గో స్థానంలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేసి సంతోష పడుతారు. మానసికంగా కొంత ఇబ్బంది పడుతారు. రాహు తొమ్మిందింట ధనలాభాలను, విదేశీయానాలను ఇస్తాడు. కేతువు మూడింట ఉండుటంతో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

Ugadi Panchangam 2019 Thula Rashi Rashi Phalalu

ఈ రాశివారి గ్రహగతుల పరిశీలించగా… ఈ ఏడాది అంతా యోగప్రదంగా ఉంటుంది. ఆర్థిక, కోర్టు, విదేశీ వ్యవహారాలు పరిష్కారమై శుభంగా ఉంటుంది. కుటుంబంలో, బంధువర్గంలో మంచి పేరు. సహాయసహకారాలు అందుతాయి. శత్రుకార్యములందు విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం, చేసేపనిలో విశేషమైన పేరు వస్తుంది. వ్యవసాయదారులకు రెండుపంటలు కలిసివస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశం. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లకు ఆశించిన పదవులు పొందుతారు, కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు కలిసివస్తాయి. ఈరాశి స్త్రీలకు గౌరవం, కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. విష్ణు ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

చైత్రమాసంలో కుజుని స్థితి ప్రతికూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ పట్టుదల, శ్రద్ధ అవసరము. వ్యాపా-రస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఆలోచన, ప్రణాళిక అవసరం. రాజకీయ, కోర్టు వ్యవ-హారములందు ప్రతికూలత ఉంటుంది. వైశాఖ మాసంలో ఆత్మీయులు, స్నేహితులతో అనవసరమైన గొడవలు. అనాలోచిత పెట్టుబడుల మూలంగా ఆర్థిక సమస్యలు. అనవసరమైన ప్రయాణాల మూలంగా అలసట. జ్యేష్టమాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంటుంది. సమస్యలను అధిగమిస్తారు. అవసరానికి సరిపడా రాబడి వుంటుంది. కొంత ఆదాయం కూడాను వృద్ధి అవుతుంది. ఆషాఢ మాసం అనుకూ-లంగా వుంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. శ్రావణ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంది. పూర్వ పెట్టుబడుల మూలంగా లాభాలను ఆర్జిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. మంచిస్థితికి చేరే అవకాశాలు వున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాద్రపద మాసంలో రవి, కుజుల ప్రతికూల స్థితి వలన కొంత ఆలోచన అవసరం. వ్యాపారస్తులకు రోజువారీ క్రయ విక్రయ-ములలో లాభాలుంటాయి. అయినా శ్రమాధికము గోచరిస్తున్నది.

ఆశ్వీయుజ మాసంలో మొదటి రెండు వారములలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉండి, ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మానసి-కంగా ఇబ్బందులు. పనులలో ఆటంకాలు. కార్తీక మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. ఆదాయం పెరుగు-తుంది. శుభకార్య సమాలోచన చేస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. మార్గశిర మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన పనులలో ఆలస్యము అయిననూ పూర్తి చేయగలగుతారు. పౌష్య మాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంది. ప్రారం-భించిన పనులు అనుకూలిస్తాయి. చికాకులు, ఆటం-కాలు ఉన్నా పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసి-వస్తుంది. మాఘ మాసంలో మంచి అవకాశాలు వస్తాయి. సద్వినియోగ పరచుకున్నట్లయితే సత్ఫలి-తాలను పొందుతారు. అర్ధాష్టమ శని ప్రభావంతో పనులలో కొంత ఆటంకము, ఆలస్యము ఉండవచ్చు. ఫాల్గుణ మాసంలో 1, 2 వారములు మామూలుగా వుంటాయి. 3, 4 వారాలలో అనుకూలత వుంటుంది. పనులలో ఒత్తిడి మూలంగా మొదట్లో కొన్ని ఇబ్బం-దులను ఎదుర్కొన్నా తరువాత మంచి ఫలితాలను పొందుతారు.

-కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
వృషభం
మిథునరాశి
కర్కాటకం
సింహం
కన్య
తుల
వృశ్చికం
ధనుస్సు
మకరం
మీన‌రాశి
కుంభరాశి

Read more RELATED
Recommended to you

Exit mobile version