వృషభం రాశి యొక్క రాశి ఫలాలు
(కృత్తిక-2,3,4 పాదాలు, రోహిణి 1,2,3,4, మృగశిర 1, 2 పాదాలు)
ఆదాయం-8, వ్యయం-8
రాజపూజ్యం-6, అవమానం-6
ఈరాశివారికి గురువు అష్టమంలో సంచరించే సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు. నూతన గృహప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. శని సంచారం వలన వృత్తి, ఉద్యోగ విషయాల్లో కింది ఉద్యోగుల సహాయసహకారాలతో పనులు పూర్తిచేసుకోగల్గుతారు. రాహు, కేతు సంచారం వల్ల మీరు మాట్లాడే తీరు అపార్థాలకు అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడటం మంచిది. మొత్తం మీద గ్రహగతుల పరిశీలన ఆధారంగా విశేష యోగ ప్రదముగా ఉంటుంది. కుటుంబ ఆర్థికస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. పుత్రసంతానంతో గౌరవం పెరుగుతుంది. కోర్టు, విదేశీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి, శ్రమ అధికంగా ఉంటుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి. వ్యవసాయదారులకు పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విద్యలో రాణిస్తారు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులకు అనుకూలమైన ఏడాదిగా ఉంటుంది. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లకు అనుకూలం. రాజకీయనాయకులకు విశేషమైన పదవీబాధ్యతలు. స్త్రీలకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం.
చైత్రమాసంలో ఈ రాశి వారికి శని, కుజుల ప్రతికూల సంచారము వలన స్నేహితులు, అన్నదమ్ములతో మనస్పర్థలు. భూముల మూలంగా ఇబ్బందులు. పట్టుదల సన్నగిల్లడంతో పనులలో ఆలస్యము. నలు-గురిలో ఇబ్బందికర వాతావరణము. అయితే, కొన్ని విషయాలలో పూర్వ స్నేహితులు, ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వైశాఖ మాసంలో ప్రారంభించిన పనులు వేగవంతమవు-తాయి. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా పనులు నెరవేరుతాయి. జ్యేష్టమాసంలో మొదటి భాగంలో ఇబ్బందులు ఉన్ననూ క్రమంగా అనుకూలిస్తుంది. ఆషాఢంలో రావలసిన డబ్బు సమయానికి అందు-తుంది. ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. శ్రావ-ణమాసంలో ప్రారంభించిన పనులలో నిబద్ధత అవ-సరము. అనవసరమైన తొందరపాటును విడనాడడం చాలా ముఖ్యం. లోతుగా ఆలోచించి కార్యాలు ప్రారంభించడం అన్ని విధాలుగా మంచిది. భాద్రపద మాసంలో ప్రారంభించిన పనులు పట్టుదలతో చేస్తారు. సత్ఫలితాలను సాధిస్తారు. స్నేహితులు, బంధువులతో వ్యవహారము జాగ్రత్తగా చేయాలి. ఆశ్వీయుజంలో ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు తీరడంతో పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి.
కార్తీకంలో కుటుంబంలో భార్యాపిల్లలతో మనస్పర్థలు, కలహాలు తద్వారా చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదురవవచ్చు. మొండితనానికి వెళ్లకుండా ఆలోచనతో ముందుకు వెళ్లడం మంచిది. మార్గశి-రంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మాసాంతంలో కొంత ప్రశాంతత చోటు చేసుకుం-టుంది. రోజువారీ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. పౌష్యమాసంలో మొదటి భాగంలో గ్రహ-స్థితి మామూలుగా ఉన్నా మాసాంతంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తయ్యేంత వరకు సహనంతో ఉండడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. మాఘ మాసంలో వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్త వహిం-చాలి. విద్యార్థులు ప్రణాళికలు వేసుకుని చదివినట్ల-యితే మంచి ఫలితాలను పొందుతారు. ఫాల్గుణ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిబద్ధతతో, ఆలోచనతో ముందుకు వెళ్లే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
– కేశవ