వృశ్చికరాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

-

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం వృశ్చికరాశి రాశిఫ‌లాలు

విశాఖ-4వపాదం, అనూరాధ- నాలుగుపాదాలు, జ్యేష్ట-నాలుగుపాదాలు
ఆదాయం-14 వ్యయం-14
రాజపూజ్యం-3 అవమానం-1

ఈరాశివారికి గురువు వత్సరాది నుంచి ఏప్రిల్ 22 వరకు, తిరిగి నవంబర్ 4 నుంచి ధనస్సులో ద్వితీయస్థానంలో మంచి ఫలితాలు కలిగిస్తాడు. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు జన్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కొంత అనారోగ్యం కలుగుతుంది. కొత్త పనులు ప్రారంభ చేయకపోవడం మంచిది. శని ద్వితీయస్థానంలో ఉంటాడు. ఆచితూచి మాట్లాడటం వలన గౌరవం పెరుగుతుంది. జాగ్రత్తగా మెలగాలి. రాహువు అష్టమంలో ఉంటాడు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.కేతవు రెండింట ఉన్నాడు. మాట విలువను కాపాడుకోవాలి. మీ మాటల వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. గ్రహగతుల పరిశీలనతో… ఈ సారి గడ్డుకాలం అని చెప్పవచ్చు. పనుల్లో ఆటంకాలు.

కుటుంబ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో అశాంతి, కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేసేపనిలో ఎక్కువ శ్రమ. బాగా కష్టపడితే తప్ప ఫలితం ఉండదు. వ్యవసాయదారులు పంటలు పండించినా ధనం చేతికందదు. విద్యార్థులు తీవ్రంగా కష్టపడితే తప్ప విజయం పొందలేరు. వ్యాపారులకు ఖర్చు అధికంగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఉద్యోగులకు ఆశించిన మేర ఫలితం ఉండదు. ఈరాశి స్త్రీలు ఆరోగ్యమందు జాగ్రత్తగా ఉండాలి.

Ugadi Panchangam 2019 Vrushik rashi Rashi Phalalu

చైత్రమాసం అనుకూలంగా వుంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసు-కోవడంతో మంచి ఫలితాలను పొందుతారు. అన్నద-మ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి వి-ద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వుంటాయి. శుభకార్య సమాలోచనలు ఫలిస్తాయి. వైశాఖ మాసంలో శ్రమాధికము. అనవసరమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడము. వృధా ప్రయాణాలు, కాల-యాపన. అనవసరమైన ఖర్చులు. బంధువులు, స్నేహితులతో గొడవలు. నలుగురిలో అపఖ్యాతి. జ్యేష్టమాసంలో గురు, శని స్థితి మూలంగా అన్ని ప్రారంభించిన పనులలోనూ నిబద్ధత అవసరం. కష్టానికి ఓర్చి పనులు చేయడము మూలంగా కొంత ఫలితాలను పొందుతారు. ఆషాఢంలో వ్యాపారస్తులు నిత్య క్రయ విక్రయములలో శ్రద్ధ వహిస్తూ పనివారి సహాయ సహకారాలతో ముందుకు వెళితే లాభాలను గడిస్తారు. అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. తద్వారా చాలా పనులు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో ప్రారం-భించిన పనులు పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలి-స్తాయి. కొన్ని పనులలో ఆర్థిక సమస్యలు ఎదురైనా అనుకూలంగా పూర్తవుతాయి. పిల్లల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. భాద్రపద మాసంలో మిశ్రమ ఫలితాలు.

కొన్ని విషయాలలో అనుకూలత. కొన్నింటిలో ప్రతికూలత ఉంటుంది. ఆశ్వీయుజ మాసంలో ప్రారంభించిన పనులు అను-కున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యంగా వుంటారు. కష్టపడి పనులు చేయడం మూలంగా పేరు ప్రతిష్టలు, లాభాలను గడిస్తారు. కార్తీక మాసంలో సమయస్ఫూర్తి చాలా అవసరం. ప్రతి పనిని ప్రణాళి-కాయుతంగా చేస్తూ, ముందుకు వెళితే సత్ఫలితాలను పొందుతారు. లాభాలను గడిస్తారు. మార్గశిర మాసంలో కుజ, రాహు, శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు వుంటాయి. దానికి తోడు వృధా ఖర్చులు. ముందుచూపుతో వ్యవహరించడం అత్యవసరం. పౌష్య మాసంలో గ్రహస్థితి మామూలుగా ఉంది. అన్ని విషయాల్లోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రణాళికాయుతంగా పనులు చేయడం అవసరం. మాఘ మాసంలో శని, గురు అనుకూలంగా ఉన్నా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రారం-భించిన పనులలో ఆటంకాలు, సమస్యలు వుంటాయి. స్థిరంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లడము అవసరం. ఫాల్గుణ మాసంలో గ్రహసంచారము మిశ్రమంగా ఉంది. కొన్ని విషయాలలో మంచి ఫలి-తాలు, కొన్ని విషయాలలో ఆందోళనలు వుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి.

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
వృషభం
మిథునరాశి
కర్కాటకం
సింహం
కన్య
తుల
వృశ్చికం
ధనుస్సు
మకరం
మీన‌రాశి
కుంభరాశి

Read more RELATED
Recommended to you

Exit mobile version