వాస్తు: ఆర్ధిక నష్టం కలుగకుండా ఉండాలంటే ఆఫీసులో ఈ మార్పులు చెయ్యండి..!

-

ఈరోజు వాస్తు(vastu) పండితులు ఆఫీసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. వీటిని కనుక అనుసరిస్తే ఆర్ధిక నష్టం కలుగకుండా మంచి లాభాలు వస్తాయి మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

 వాస్తు/ vastu
వాస్తు/ vastu

వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసుని నిర్మించుకునే సమయంలో తప్పకుండా ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిది అని అంటున్నారు. ముఖ్యంగా ముఖద్వారం వైపు కాస్త శ్రద్ధ ఎక్కువ పెట్టాలని పండితులు అంటున్నారు. ముఖ ద్వారం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపుకి మాత్రమే ఉండాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు.

అదే విధంగా వెయిటింగ్ రూం ఈశాన్యం వైపు ఉంటే మంచిదని చెబుతున్నారు. అలానే పని చేస్తున్నప్పుడు ఉత్తరం వైపు కూర్చునేలా చూసుకోవడం మంచిది. దీనివల్ల ఆర్థిక నష్టం లేకుండా లాభాలు ఉంటాయి.

అలానే ఎప్పుడైనా మీరు ఫర్నిచర్ ని కొనుగోలు చేసేటప్పుడు గుండ్రంగా ఉండే వాటిని కొనుగోలు చేయొద్దు. దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు పండితులు. అదే విధంగా ఆఫీస్ గోడలకి ఎప్పుడూ కూడా లైట్ షేడ్స్ ని మాత్రమే ఉపయోగించాలని డార్క్ షేడ్స్ ని ఉపయోగించడం వల్ల నెగిటివిటీ ఉంటుందని చెప్పారు.

ఎరుపు రంగు వంటివాటిని ఉత్తరం వైపు అసలు వేయొద్దని అంటున్నారు. ఆఫీసుకి దక్షిణం వైపు లో మొక్కలు పెంచడం వల్ల పాజిటివిటీ పెరుగుతుందని చెప్పడం జరిగింది. కనుక ఈ చిన్న చిన్న
టిప్స్ ని మీరు పాటించారు అంటే తప్పకుండా ఆర్ధిక నష్టం ఏమీ లేకుండా లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news