కష్టాల నుండి గట్టెక్కలేకపోతున్నారా…? అయితే ఇలా చెయ్యండి..!

చాలామంది ఇళ్లల్లో కష్టాలు ఉంటాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ కష్టాలు తీరవు. ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీరు కూడా కష్టాల నుండి గట్టెక్కలేక పోతున్నారా…? అయితే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అనుసరిస్తే తప్పకుండా కష్టాల నుండి బయట పడవచ్చు. దీనితో ఆనందంగా ఉండొచ్చు. ఇలా అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు మొదలైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

 

vasthu1

నరుడు దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని అంటుంటారు. అలాంటిది మన కుటుంబంలో సమస్య తీసుకురావడం ఒక పెద్ద లెక్కా..? అందుకని నరుడు దృష్టి పడకుండా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలి. చాలామంది వీటిని మూఢనమ్మకాలలాగ భావించి పట్టించుకోరు. కానీ ఇంటి ముందు కనుక గుమ్మడికాయ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది.

దీంతో ఇంట్లో తరచూ గొడవలు డబ్బు సమస్యలు పరిష్కారం లాంటివి జరుగుతాయి ఒకవేళ గుమ్మడికాయ కట్టినట్లయితే నరదృష్టి ఇంటి మీద పడదు అలానే బయటికి వెళ్లి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం కూడా చాలా మంచి అలవాటు. దీనివల్ల కూడా నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించదు.

బయటికి వెళ్లినప్పుడు చాలామంది దిష్టి తీసి ఎర్ర నీళ్లు నిమ్మకాయలు లాంటివి పడేస్తారు. అటువంటివి మన ఇంటికి రావడం వల్ల సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఒక గిన్నెలో రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి తెల్ల ఆవాలైన మంచిదే. ఆ తర్వాత పసుపు వేయాలి ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి దానిని అరచేతిలో పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ చూపించండి ఇలా చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది.