Vasthu : మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే ఈ పొరపాట్లు మాత్రం చెయ్యొద్దు..!

-

హిందూ మత గ్రంథాలలో తులసికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవిత్రమైనదిగా పూజిస్తారు. శ్రీమహాలక్ష్మి దేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. మహా విష్ణువు తులసి ప్రియుడు. ప్రతిరోజు విష్ణుమూర్తికి తులసిదళం సమర్పిస్తే ఐశ్వర్యాలు కలుగుతాయి. తులసి మొక్కని ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఆనందం ఉంటుంది. శుభ ఫలితాలు కూడా వస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం తులసి మొక్కను క్రమం తప్పకుండా పోషించడం వలన.. సరైన దిశలో ఉంచడం వలన శ్రేయస్సు సానుకూలత కలుగుతుంది. తులసిని మీకు నచ్చినట్లు ఉంచకూడదు. అలా చేస్తే కష్టాలు వస్తాయి. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిశలో ఉంచాలి..? ఎలాంటి వాటిని ఆచరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

తూర్పు దిశలో తులసి మొక్కని నాటాలి. ఒకవేళ కుదరకపోతే ఈశాన్య దిక్కుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ దిక్కులలో తులసి ఉండడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తులసి కోటలో ఉన్న తులసి మొక్క నుంచి ఎప్పుడూ కూడా పూజకి తులసి ఆకుల్ని కోయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుంది.

పూజ కోసం ప్రత్యేకంగా ఇంకో ప్రదేశంలో మొక్క వేసుకోవాలి. తులసి మొక్కని నిత్యం పూజించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. తులసి మొక్క పైన ఉండే విత్తనాలు క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. తులసి మొక్క నిటారుగా పెరుగుతుంది. మంగళ, శుక్రవారం రోజుల్లో తులసి ఆకులను కొయ్యకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలని కోసి పూజ చేయొచ్చు దక్షిణ వైపు పొరపాటున కూడా తులసి మొక్కని నాటవద్దు. ఆ తప్పు చేశారంటే కుటుంబ సమస్యలు వస్తాయి

Read more RELATED
Recommended to you

Latest news