వాస్తు: మందారం చెట్టు ఇంట్లో ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి..!!

-

మనం ఎటువంటి పూజలు చేసినా ముందుగా గణపతి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.. అందుకే ఆయనను ఆది దేవుడు అని పిలుస్తారు.ముందు ఆయనకు పూజలు అందించాక మరో దేవుడికి పూజ చేస్తారు.అయితే వినాయకుడికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతి. అందుకే ఆయనకు ఎక్కువ మంది ఎరుపు మందారం, ఎరుపు గన్నేరు పూలు, ముద్ద మందారం పూలను అర్పిస్తుంటారు. దీంతో ఆ దేవదేవుడు మెచ్చి, ఆయన చల్లని చూపును మనవైపు కురిపిస్తుంటారు..

పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగిస్తుంది. పూలను ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని.. వాస్తు దోషం ఎదైన ఉంటే దాన్ని నివారిస్తుందని పండితులు అంటున్నారు. అందుకే ఎక్కువ మంది పూజలో ఎరుపు రంగు పూలకు ప్రయారిటీ ఇస్తుంటారు..పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ప్రాధాన్యతనిస్తాయి మరియు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి. పూలను ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తు దోషాలను నివారిస్తుందని పండితులు అంటున్నారు..

దేవుడి పూజతో పాటు వాస్తుశాస్త్రంలో మందార పువ్వుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇండోర్‌కు చెందిన జ్యోతిష్యుడు , వాస్తు సలహాదారు పండిట్ కృష్ణకాంత్ శర్మ ఇది మంచి, చెడులను ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం బజరంగబలి దేవుడిని, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని తెలిపారు.

దేవుడికి ఈ పూలను సమర్పిస్తే పోయిన వస్తువులు వెంటనే అందుతాయని నమ్మకం..పూజలో మందార లేకుండా సూర్య నారాయణుని ఆరాధించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. సూర్యారాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుని తేజస్సును పొందడానికి ఎల్లప్పుడూ ఆరాధించండి.సానుకూల శక్తిని కూడా ఇస్తుంది. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. సూర్యుని బలపరుస్తుంది. జాతకంలో సూర్యుని బలహీనత ఉన్న వ్యక్తి గ్రహ దోషాలను తొలగించడానికి ఈ పరిహారం చేయవచ్చు.చదువులో ఏకాగ్రత కూడా ఉండేలా చేస్తుందని చేస్తుంది.. అందుకే ఎర్ర మందార పూలను ఎక్కువగా పూజలో వాడతారు.

Read more RELATED
Recommended to you

Latest news