Vasthu : ఆ రోజు తులసి మొక్కని నాటితే.. కాసుల వర్షమే..!

-

ఇంట్లో వాస్తు ప్రకారం పాటించడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో తులసి మొక్క నాటితే ధనవర్షం కురుస్తుంది. అయితే తులసి మొక్క నాటడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. హిందూ మతంలో తులసి చెట్టుని పవిత్రమైనదనిగా భావిస్తారు. పూజలు చేస్తారు. ఇంట్లో ఈ చెట్టుని నాటడానికి కొన్ని నియమాలు ఉంటాయి. మీ ఇంట్లో తులసి మొక్కను నాటబోతున్నట్లయితే ఏ దిక్కు సరైనదో ఏ రోజు నాటాలో తెలుసుకోండి. వాస్తు ప్రకారం తులసి చెట్టుని నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీని కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది.

వాస్తు ప్రకారం తులసి మొక్కను నాటడానికి కార్తీక మాసం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటడానికి గురువారం చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే తులసి మహావిష్ణువుకి చాలా ఇష్టం. గురువారం కూడా ఆయనకు చాలా ఇష్టమైన రోజు. గురువారం నాడు తులసి మొక్కని నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్కని నాటితే దానిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

ఆదివారాలు ఏకాదశి తిధుల్లో తులసి మొక్కను పొరపాటున కూడా ముట్టుకోకూడదు. మత విశ్వాసం ప్రకారం తులసి ఈ రెండు రోజుల్లో శ్రీమహావిష్ణువు కోసం నిర్జల వ్రతం పాటిస్తుంది కనుక ఈ రోజుల్లో తులసిని తాకకూడదు. నీరు కూడా పోయకూడదు. అలాగే రాత్రి చీకటి పడిన తర్వాత కూడా తులసి మొక్కని ముట్టుకోవడం తులసి ఆకులను కోయడం వంటివి చేయకూడదు. ఇలాంటి తప్పులు చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అదే మీరు గురువారం నాడు తులసిని నాటితే కాసుల వర్షం కురుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news