బీఆర్ఎస్ 49 వేల రేషన్ కార్డులు ఇచ్చింది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉప ఎన్నికలు ఉన్న చోట మాత్రమే 49వేల రేషన్ కార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు మంత్రి పొంగులేటి. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు 4 సార్లు భేటీ అయింది. అందులో అందరి సలహాలు, సూచనలపై చర్చ జరిగినట్టు తెలిపారు.

ప్రజాప్రతినిధులు సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ఇప్పటివరకు 16 మంది ఇచ్చారని.. వాటి గురించి ఈ మీటింగ్ లో చర్చించామని గుర్తు చేశారు. అవసరం అయినా సలహాలు ప్రతిపక్షం ఇచ్చినా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎలాంటి బేషజాలకు పోదని తెలిపారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని.. వాటిని బైఫర్ కేషన్ చేసి స్మార్ట్ కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ఉద్దేశం అని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసిన వాటితో కలుపుకొని 49వేలు ఇచ్చిందని తెలిపారు. 21 కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందని.. ఈ నెల చివరి వరకు ప్రభుత్వానికి రిపోర్టు అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news