గుజరాత్ నుంచి రాగానే చంద్రబాబు చేసే మొదటి పని అదే.. వారికి క్లాస్ తప్పేలా లేదు

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది..అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.. ప్రకృతి సంపదలను దో్చుకుంటున్నారు.. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రుల బంధువులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.. మరికొంత మందికి నేరుగా క్లాస్ తీసుకునేందుకు ఆయన సిద్దమయ్యారని టీడీపీవర్గాలు చెబుతున్నాయి..

ఈ నెల 20వ తేదీతో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతోంది. దీంతో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందనను కొన్ని సర్వేల ద్వారా సీఎం చంద్రబాబునాయుడు తెప్పించుకున్నారట.. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీకి రాగానే కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం.. కొందరి వ్యవహారశైలితో మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని గతంలో జరిగిన కేబినెట్ భేటీలోనే చంద్రబాబు చెప్పేశారు.

గుజరాత్ నుంచి రాగానే ఎమ్మెల్యేలను విడతల వారీగా లేదా ఒకేసారి పిలిపించి మాట్లాడబోతున్నారని సీనియర్ నేతలు చెబుతున్నారు. కడప, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరుజిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట.. వారితో పాటు.. మహిళా ఎమ్మెల్యే భర్త తీరుపై ఆయనకు పిర్యాదులు రావడంతో దాని మీద కూడా సీరియస్ క్లాస్ ఉంటుందని.. పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.. ఎమ్మెల్యేలను కట్టడి చెయ్యకపోతే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భావనలో ఉన్న చంద్రబాబు.. ఈ విధం క్లాస్ తీసుకోబోతున్నారని సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news