Vasthu : తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క కచ్చితంగా ఉండాలి తులసి మొక్క లేకుండా ఏ ఇల్లు కూడా ఉండకూడదు. తులసి మొక్క దగ్గర పూజ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చూసినట్లయితే తులసి మొక్క ఇంట్లో నాటుతూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము కానీ తులసి మొక్క సరిగ్గా ఎదగదు ఎండిపోతూ ఉంటుంది వాడిపోతూ ఉంటుంది. పైగా తులసి మొక్క ఎండిపోవడం మంచిది కాదు.

 

తులసి మొక్క ఇంట్లో ఎండిపోతే అది అశుభంగా భావిస్తారు మంచిది కాదని అంటూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలు కలగకుండా, తులసి మొక్క బాగా పెరగాలన్న తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలన్న ఇలా చేయండి. ఎక్కువ నీళ్లు పోయడం వలన చెట్టు వేర్లకి తెగులు పడుతుంది కాబట్టి మరీ ఎక్కువగా నీళ్లు పోయకండి. ఎంత అవసరమో అంతే పోయండి. మొక్కపై ఉదయం సూర్య కిరణాలు సరిగ్గా పడే ప్రదేశంలో మొక్కని నాటాలి.

కాబట్టి మొక్కని నాటేటప్పుడు చూసుకోండి. ప్రతి రెండు వారాలకు ఒకసారి తులసి మొక్కకి ఎరువులు వేస్తే కూడా తులసి మొక్క బాగా ఎదుగుతుంది. ఆవు పేడ వేస్తే కూడా మొక్క బాగా ఎదుగుతుంది. ఇలా తులసి మొక్కని మీరు ఈ చిట్కాలతో పెంచాలంటే తులసి మొక్క వాడిపోదు. తులసి మొక్క బాగుంటుంది తులసి మొక్క బాగుంటే అశుభం కలగదు. తులసి ఆకులను తెంపేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి వాటిని కూడా తెలుసుకోండి అలానే ప్రతిరోజు సంధ్య వేళలో తులసి దగ్గర దీపం పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సమస్యల నుండి బయట కి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news