వాస్తు: లాఫింగ్ బుద్ధాని ఈ చోట్లలో పెడితే ఎంతో మంచిది తెలుసా..?

చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబంలో కలహాలు రావడం, ధన నష్టం లేదు అంటే అనారోగ్య సమస్యలు రావడం లాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి వాళ్లు వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా మేలు కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే కచ్చితంగా నెగటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

 

laughing budda

చాలామంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాని పెడుతూ ఉంటారు. అయితే నిజంగా లాఫింగ్ బుద్ధాని పెట్టడం వల్ల ఇంటికి మంచిది. ఆర్ధిక సమస్యల్ని ఇది తొలగిస్తుంది. అదే విధంగా అదృష్టాన్ని ఇది తీసుకు వస్తుంది. లాఫింగ్ బుద్ధాని ఎక్కడ ఎక్కడ పెట్టాలి అనేది చూస్తే… ముఖద్వారానికి ఎదురుగా దీనిని ఎప్పుడూ పెట్టొద్దు.

కానీ లోపల నుండి రాగానే మొదటగా మనకి లాఫింగ్ బుద్ధా కనబడేటట్టు ఉంచాలి. అలానే ఇంటికి తగ్గట్టుగా మీరు లాఫింగ్ బుద్ధాని పెట్టండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. అలాగే లాఫింగ్ బుద్దని పెట్టడం వల్ల ఆర్ధిక నష్టం ఉండదు. డబ్బులు బాగా వస్తాయి. అదే విధంగా కష్టానికి తగ్గ ఫలితం కూడా కనబడుతుంది. ఇలా ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు అలానే మంచి కలుగుతుంది.