వాస్తు: వ్యాపారం బాగుండాలంటే ఈ విధంగా అనుసరించండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎక్కువ మంది వ్యాపార సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అయితే మరి వ్యాపారంలో సక్సెస్ పొందాలంటే ఎలాంటి పద్ధతిని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా వ్యాపారంలో మంచి ఫలితాలు పొందవచ్చు.

 

ఆఫీస్ లో కానీ షాపులో కానీ మంచి లాభం పొందాలంటే దేవుడి గది ఎప్పుడూ తూర్పు వైపు ఉంటే మంచిది. అలానే మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ ని కానీ ఫ్యాక్టరీని గాని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచిగా వ్యాపారం అవ్వాలంటే ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలి. శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అదేవిధంగా ఫర్నిచర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

ఫర్నిచర్ కూడా అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇర్ రెగ్యులర్ గా ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడో కూడా ఆఫీసులో ఫర్నీచర్ ని కొనుగోలు చేసేటప్పుడు గుండ్రంగా ఉన్నది కొనద్దు. స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్ లో ఉండే వాటిని కొనుగోలు చేస్తే మంచిది.

అదే విధంగా వెలుతురు కూడా మంచిగా ఉండేటట్లు చూసుకోండి. చీకటిగా ఉండడంవల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే మంచి పెయింట్లు కూడా వేసుకుంటూ ఉండండి. వీటివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమవుతుంది. దీనితో వ్యాపారంలో నష్టాలు కలగకుండా ఉంటాయి.