హైదరాబాద్ లోని బోరబండ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధ విషయాన్ని బయట చెబుతామని బెదిరించి ఇద్దరు యువకులు ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బోరబండ లో నివసిస్తున్న బాధితురాలికి కూలి పని దగ్గర వెంకట్ అనే వ్యక్తి కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారిందని సమాచారం. అయితే… వీరిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని వారికి అనువుగా మార్చుకున్న దుర్మార్గులు.. ఆ యువతిని రేప్ చేశారు.
వివాహేతర సంబంధాన్ని బయటపెడతామని బెదిరించి ఆ మహిళపై లైంగిక వాంఛ తీర్చుకున్నారు ఇస్మాయిల్, యాసిన్ అనే ఇద్దరు వ్యక్తులు. అనంతరం జరిగిన ఘటనకు భరించలేక బాధిత మహిళ తో పాటు ప్రియుడు వెంకట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వికారాబాద్ అడవుల్లో ఇద్దరు పురుగుల మందు తాగారు. ఈ విషయం తెలిసి వెంకట్ తమ్ముడు ఘటనా స్థలానికి చేరుకుని వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చాడు. ఆ తర్వాత ఈ సంఘటన పై ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.