వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి మొక్కలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈ రోజు తెలుసుకుందాం.
చాలా మంది అనేక ఇబ్బందుల తో బాధ పడుతూ ఉంటారు. సమస్యలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఈ తప్పులని చేయకండి. దానితో ఇబ్బందులు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు అసలు ఇంట్లో ఉండకూడదని వాస్తు పండితులు అంటున్నారు. ఇటువంటి మొక్కలని ఇంట్లో అస్సలు ఉంచకండి. చూడడానికి బోన్సాయ్ మొక్కలు అందంగా ఉంటాయి కానీ బోన్సాయ్ మొక్కలని ఇంట్లో ఉంచుకోకూడదు. దీనివలన మీయొక్క ఎదుగుదలకి అడ్డం వస్తుంది. అలానే పత్తి మొక్కను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దీని వలన కూడా సమస్యలు వస్తాయి. దురదృష్టం కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం క్యాక్టస్ మొక్కని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. చనిపోయిన మొక్కలని వాడిపోయిన మొక్కలని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ మొక్కలని ఇంట్లో ఉంచుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలిపి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అదే విధంగా సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో నాటకండి.