వాస్తు: వంట గదిలో ఈ మార్పులు చేస్తే ఆర్ధిక ఇబ్బందులు వుండవు..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే అన్ని గదుల్లో కూడా వాస్తు ప్రకారం ఫాలో అవ్వాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. అయితే ఈ రోజు వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పండితులు చెప్పడం జరిగింది. వాటిని ఫాలో అయితే కచ్చితంగా వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.

 

వంట గది ఎప్పుడూ కూడా పడమర వైపు ఉంచుకోవాలి. అలాగే పొయ్యి ఈశాన్యం వైపు ఉండాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి వంట చేస్తే మంచిది. అదే విధంగా వంట గదిలో బాగా బరువుగా ఉండే వస్తువులను మీరు కనుక ఉంచాలి అంటే అప్పుడు నైరుతి వైపు ఉంచాలి. అదే విధంగా స్టవ్ ని పెట్టుకునే గట్టు ఎప్పుడూ కూడా తెల్లటి మార్బుల్ తో తయారు చేసింది అయ్యి ఉండాలి.

మీరు ఒకవేళ కనుక టైల్స్ పెట్టుకోవాలంటే అవి విరిగి పోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే వంటగది నుండి బయటకు వెళ్ళి నీళ్ళు ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి ఎప్పటికప్పుడు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తాచెదారం ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.

ఇక వంట గదిలో ఎటువంటి రంగులు వాడాలి అనే విషయానికి వస్తే… వంట గదిలో తెలుపు లేదా పసుపు రంగు గోడలకి వేస్తే మంచిది. అలాగే సీలింగ్ కి కూడా పసుపు లేదా తెలుపు రంగు వేస్తే మంచిది లేదు అంటే లైట్ కలర్స్ ని వాడొచ్చు. ఇలా ఈ వాస్తు చిట్కాలను కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news