ఈ ఊళ్లో ఇళ్లు కేవలం 90 రూపాయలకే అమ్ముతున్నారట.. ఎక్కడంటే..!

-

ఈ రోజుల్లో ఇల్లుకట్టటం, ఆడపిల్లలకు ఘనంగా పెళ్లిచేయటం సామాన్యుడికి పెద్ద టాస్కే.చాలిచాలని జీతాలు స్కూల్/ కాలేజ్ ఫీజులకు, పెట్రోల్ ఖర్చులకు, ఇరుకిళ్ల అద్దెలకు, మండుతున్న ధరలతో నిత్యవసర సరుకులు కొనటానికే అయిపోతున్నాయి. ఇంక సేవింగ్స్ ఎక్కడ చేయాలి. సొంతిళ్లు ఎప్పుడు కట్టాలి. ఇవన్నీ చాలవన్నట్లు ఆడపిల్ల పెళ్లి. పెళ్లంటే మామూలు విషయం కాదు.లక్షల్లో కట్నాలు వేలల్లో షాపింగ్ లు. ఇలాంటి పరిస్థితుల్లో 90రూపాయలకే ఇళ్లు అమ్ముతున్నారట.. అనే విషయం భలే వింతగా ఉంది కదూ.. కానీ ఇది ఇక్కడ కాదు.. సరే ఎక్కడైనా అంత తక్కువ ధరకే ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలని ఆసక్తి అయితే ఉంటుంది కదా. ఇటలీలో ఒక యూరోకి కప్పు కాఫీ కూడా రాదట. కానీ ఇల్లే అమ్మేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు చూద్దాం.

ఇటలీలో కాస్టిగ్లియోన్ డీసీసీలియా వద్ద సిసిలియన్ పట్టణంలో ఇటువంటి ఇళ్లను అమ్ముతున్నారట. ఇది ఇటలీలో మొదటిసారేమి కాదట. సలేమి, బిసక్సియా వంటి ప్రాంతాల్లో గతంలో కూడా తక్కువ ధరకే ఇల్లు అమ్మినవారున్నారు. కాస్టిగ్లియోన్ డి సీసీలియా ఎట్నా పర్వతం యొక్క వాలుపై ఉంది. ఇంకా బీచ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందట.

ఆ ప్రాంతం లో సుమారు 900 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లలో దాదాపు సగం శిధిలమైన స్థితిలో ఉన్నాయి .కాబట్టి వాటిని 1 యూరోల సింబాలిక్ ధరకు అమ్ముతారు, ఇది సుమారు రూ. ఇండియన్ కరెన్సీలో 90 ఉండగా, మిగిలిన ఇళ్ల ధర కూడా 4 కే నుంచి 5 కె యూరోల మధ్య ఉంటుంది. అంటే, 3.5 లక్షల నుంచి భారత్ కరెన్సీలో 4.5 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. చాల వరకు ఇళ్లకు మరమ్మత్తులు చేయాల్సి ఉందట.

కండీషన్స్ అప్లైయ్

ఆ ఇళ్లను కొనుక్కున్న కొత్త యజమానులు మూడేళ్ళలోపు ఆ ఇంటికి అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసుకోవాలన్న షరతు పై తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది కాబట్టే ఈ ప్రాంత పురాతన నిర్మాణ వారసత్వాన్ని కాపాడాలంటూ ఆ నగర మేయర్ ఆంటోనినో కమర్డా పేర్కొన్నారు.

1930లో ఈ గ్రామంలో 2,500 మంది ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది ఈ గ్రామం నుంచి వెళ్లిపోయారట. అలా కాలక్రమేణా 1960 తరువాత యువకులు ఉపాధి కోసం ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉండే జనాభాలో 60 శాతం మంది 70 ఏళ్ల పైబడినవారే.

ఇదనమాట సంగతి..పురాతన చరిత్ర కాపటానికి ఆ ప్రాంతంలో ఇళ్లను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇళ్లను అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news