వాస్తు: లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలని పాటించాలి..!

మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రశాంతత లేకపోవడం లాంటివి. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా నడుచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చని పండితుల చెప్పడం జరిగింది. అయితే మరి ఆలస్యమెందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం.

సరైన రంగులు ఎంచుకోవడం:

ఇంట్లో వేసే రంగులు మన యొక్క మూడ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీని పెంపొందించడానికి రంగులు సహాయం చేస్తాయి. దీంతో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. అందుకని వాస్తు శాస్త్రం ప్రకారం మంచి రంగును ఎంచుకోవాలి. ఉత్తరం వైపు ఆకుపచ్చ, తూర్పు వైపు పడమర, పడమర వైపు నీలం, దక్షిణం వైపు ఎరుపురంగు ఎంచుకోవాలి అని పండితులు చెప్పారు.

ఇంట్లో ఉండే నీళ్లు:

చాలామంది ఇంట్లో స్విమ్మింగ్ పూల్ వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫౌంటైన్ లాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నీళ్లు ఎప్పుడూ కూడా ఉత్తరం నుండి తూర్పు వైపు ప్రవహించాలి. లేదా ఇబ్బందులు వస్తాయి.

ఇంట్లో ఉండే మొక్కలు:

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఇంటికి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా అదృష్టంని పెంపొందిస్తుంది. ఒకవేళ కనుక మీ ఇంట్లో గార్డెన్ లేకపోతే అప్పుడు మీరు ఏదైనా అందమైన మొక్కల పెయింటింగ్స్ పెట్టుకోవచ్చు. అదే విధంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఈ చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.