Vastu: వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది చాలా మంది ఈరోజుల్లో కూడా వాస్తు ని అనుసరిస్తున్నారు. సమస్యలకు దూరంగా ఉంటున్నారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మన ఇంట్లో ఎటువంటి రంగులు వేయించుకోవాలి ఎలాంటి మొక్కలు అనే వాటిపైన కచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇబ్బందుల నుండి మనం గట్టెక్కచ్చు.
తులసి, షమీ, అరటి మొక్క వంటివి ఇంట్లో ఉంటే ఆనందం కలుగుతుంది ధనం వస్తుంది. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉండడం వలన ఇబ్బందుల నుండి మనం దూరంగా ఉండచ్చు. అయితే కొన్ని మొక్కలు మాత్రం ఇంట్లో ఉండకూడదు మరి ఆ మొక్కలు అంటే ఇప్పుడు చూద్దాం.. ఇంట్లో పత్తి చెట్టు ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం పత్తి చెట్టు ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి మొక్కలని ఇంట్లో పెట్టకండి.
ఇంట్లో చింత చెట్టు కూడా ఉండకూడదు చింత చెట్టు నెగటివ్ ఎనర్జీ ని కలిగించేసి పాజిటివ్ ఎనెర్జీని దూరం చేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు తీసుకొస్తుంది. అలానే గోరింటాకు కూడా నెగటివ్ ఎనర్జీని కలిగించి పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది వీటితో పాటుగా ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంచకూడదు. కాక్టస్ వంటి మొక్కలను ఇంట్లో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకుండా ఉండండి ఈ సమస్యలేమి లేకుండా హాయిగా ఉండొచ్చు.