ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంత సంచలనం సృష్టించిందో మనము చూశాము. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించి సీబీఐ మరియు ఈడీ లు కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు గురించి ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ కేసులో మూడవ ఛార్జ్ షీట్ ను కోర్ట్ లో వేసిన ఈడి పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, కవిత భర్త అనిల్, అరుణ్ పిళ్ళై ల పేర్లు మీద భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో వందల కోట్లు ముడుపులు జరిగినట్లు ఆధారాలను బట్టబయలు చేశారు.
ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అరుణ్ పిళ్ళై ఖాతా నుండి జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు. ఇలా దక్కిన డబ్బుతో తమ రాజకీయ బలంతో తక్కువ ధరకే ఎంతో విలువైన భూములు కొనుగోలు చేశారని ఈడి తెలిపింది.