వికారి నామ సంవత్సరం: కార్తెలు, వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలుసా?

-

శ్రీ వికారి నామ సంవత్సర జ్యేష్ట కృష్ణ పంచమి శనివారం 22-06-2019 రోజున సాయంత్రం 05-18 ని.లకు ధనిష్ట నక్షత్ర చతుర్థ చరణ కుంభరాశి ప్రయుక్త వృశ్చిక లగ్నమున పాదజ-లరాశి యందు సింహ వాహనమున ఆర్ద్ర కార్తి ప్రవే-శము.

రోహిణి కార్తి: శ్రీ వికారి నామ సంవత్సర వైశాఖ కృష షష్టి శనివారం తేది 25-05-2019 రోజున రాత్రి 08-25 ని.లకు ధనిష్ట నక్షత్ర ద్వితీయచరణ మకర-రాశి ప్రయుక్త ధనుర్ లగ్నమందు అర్థజల రాశి జంబూక వాహనమున రోహిణీకార్తి ప్రవేశము. ఫలము – సామాన్య వర్షము.

vikari nama samvatsara karthelu

మృగశిర కార్తి: శ్రీ వికారి నామ సంవత్సర జ్యేష్ట శుక్ల షష్టి శనివారం 08-06-2019 రోజున సాయంత్రం 06-12 ని.లకు మఘ నక్షత్ర ప్రథమ చరణ సింహరాశి ప్రయుక్త వృశ్చిక లగ్నమున పాదజల రాశి యందు మూషిక వాహనమున మృగశిర కార్తి ప్రవేశము. ఫలము – అక్కడక్కడ వర్ష సూచనలు. మొత్తం మీద ఈ కార్తిలో సామాన్య వర్షాలు.

ఆర్ద్ర కార్తి: శ్రీ వికారి నామ సంవత్సర జ్యేష్ట కృష్ణ పంచమి శనివారం 22-06-2019 రోజున సాయంత్రం 05-18 ని.లకు ధనిష్ట నక్షత్ర చతుర్థ చరణ కుంభరాశి ప్రయుక్త వృశ్చిక లగ్నమున పాదజలరాశి యందు సింహ వాహనమున ఆర్ద్ర కార్తి ప్రవేశము. ఫలితము – వృష్టి సూచన.

ఫలితము : కృష్ణ పంచమి – శుభప్రదం, ధాన్యాదులకు ధరలుండును. శనివారం – సామాన్య ఫలము, ధనిష్ట నక్షత్రం – భూములు సకాలంలో వర్షముల మూలంగా సంపూర్ణంగా ఫలించును. విష్కంభ నామ యోగం – అనుకూల వర్షాలు, తైతుల కరణం – శుభప్రదం, వృశ్చిక లగ్నం – యుద్ధభయం, సాయంకాలం – అనుకూలంగా వర్షములు ఉండడం మూలంగా పంటలు బాగుగా ఫలించును, సస్య సమృద్ధి ఉండును, ధనిష్టాది నక్షత్ర షట్కం – సుభిక్ష క్షేమారోగ్యములు, సాముదాయక ఫలం – శుభప్రదం, సస్యానుకూల వర్షం.

Read more RELATED
Recommended to you

Latest news