ఉగాది స్పెషల్ సాంగ్: ఆమని వచ్చే ఉగాది తెచ్చే.. తుమ్మెద వాలే.. పువ్వులు పూచే

231

కొత్త పండుగ ఉగాది రోజున యూట్యూబ్ లో ఉగాది స్పెషల్ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉగాది గురించి ఏమీ తెలియకున్నా ఈ వీడియో చూస్తే చాలు.. ఉగాది విశిష్టత మొత్తం తెలుస్తుంది.

ఆమని వచ్చే ఉగాది తెచ్చే.. తుమ్మెద వాలే.. పువ్వులు పూచే.. అంటూ సాగే ఉగాది స్పెషల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఆధాన్ మ్యూజిక్ రూపొందించిన ఉగాది స్పెషల్ సాంగ్ చాలా సహజంగా ఉంది. చిన్నపిల్లల అమాయకత్వం, పల్లెటూరు అందాలను ఈ వీడియోలో చాలా సహజంగా చూపించారు.

Ugadi special song 2019

ఉగాది పండుగ విశిష్టత, పండుగ విధానం, ఉగాది పచ్చడి, పంచాగ శ్రవణం.. లాంటి విషయాలను అన్నింటినీ వీడియోలో చక్కగా చూపించారు. మొత్తానికి కొత్త సంవత్సరం, కొత్త పండుగ ఉగాది రోజున యూట్యూబ్ లో ఉగాది స్పెషల్ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉగాది గురించి ఏమీ తెలియకున్నా ఈ వీడియో చూస్తే చాలు.. ఉగాది విశిష్టత మొత్తం తెలుస్తుంది.