హైద‌రాబాద్‌లో మ‌ట్టి వినాయ‌కుల‌ను ఉచితంగా ఈ కేంద్రాల్లో పొందండి..!

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల కోసం హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌, మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వినాయ‌క‌చ‌వితి వచ్చేసింది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులంద‌రూ ఇప్ప‌టికే వినాయ‌కుడి విగ్ర‌హాల కొనుగోలులో త‌ల‌మున‌క‌ల‌య్యారు. ఇక గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీలు ఈ సారి ఎంత పెద్ద విగ్ర‌హాల‌ను పెడ‌దామా అని ప్లాన్లు వేసి ఇప్ప‌టికే చాలా మంది విగ్ర‌హాల‌ను తెస్తున్నారు కూడా. అయితే మ‌ట్టి విగ్ర‌హాల‌నే పూజించాల‌ని చెబుతున్న నేప‌థ్యంలో భ‌క్తులంద‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లో పెట్టుకునేందుకు వినాయ‌కుడి మ‌ట్టి విగ్ర‌హాల కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండానే మ‌ట్టి విగ్ర‌హాల‌ను పొందేందుకు హెచ్ఎండీఏ అధికారులు శ్రీ‌కారం చుట్టారు.

HMDA distributes free clay ganesh idols at these centres in hyderabad

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల కోసం హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌, మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే న‌గ‌రంలోని 33 సెంట‌ర్ల‌లో ఈ విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు గాను మొత్తం 60వేల మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు ఈ విగ్ర‌హాల‌ను హెచ్ఎండీఏ పంపిణీ చేయ‌నుంది.

న‌గ‌రంలోని ప‌లు ఎంపిక చేసిన ప్ర‌దేశాల్లో హెచ్ఎండీఏ మొబైల్ వ్యాన్ల‌లో మ‌ట్టి వినాయ‌కుల విగ్ర‌హాలను పంపిణీ చేయ‌డం ప్రారంభించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వారు కూడా అద‌నంగా మ‌రో 1.64 ల‌క్ష‌ల మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన‌ట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. కాగా న‌గ‌రంలో కింద తెలిపిన కేంద్రాల్లో వినాయ‌కుడి మ‌ట్టి విగ్ర‌హాల‌ను హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆ కేంద్రాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* జూబ్లీహిల్స్ – క‌ళాకృతి ఆర్ట్ గ్యాల‌రీ, కేబీఆర్ పార్క్ ప్ర‌వేశ ద్వారం, ఆరోగ్య‌శ్రీ, రోడ్ నం.36 ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్
* జూబ్లీహిల్స్ – పెద్ద‌మ్మ దేవాల‌యం, రోడ్ నం.92 స్టార్ బ‌క్స్
* మాదాపూర్ – శిల్పారామం, ఐకియా స్టోర్ ద‌గ్గ‌ర, దుర్గం చెరువు, మైండ్ స్పేస్ జంక్ష‌న్‌, మై హోం న‌వద్వీప
* గ్రీన్‌ల్యాండ్స్ హిందూ న్యూస్ పేప‌ర్ ఆఫీస్ ద‌గ్గ‌ర‌, ప్రెస్ క్ల‌బ్, గ‌చ్చిబౌలి టోల్ బూత్ ఎగ్జిట్ పాయింట్
* సెక్ర‌టేరియ‌ట్ ఎదురుగా, ఎన్‌టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ప్రియ‌ద‌ర్శిని పార్క్, ఇందిరా పార్క్
* ఉప్ప‌ల్ శిల్పారామం, స‌ఫిల్‌గూడ లేక్ పార్క్ , అమీర్‌పేట మైత్రివ‌నం
* స‌రూర్‌న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం రాజీవ్ గాంధీ పార్క్, కూక‌ట్‌ప‌ల్లి మెట్రో
* తార్నాక హెచ్ఎండీఏ ఆఫీస్ ద‌గ్గ‌ర, ఓయూ ఎంట్ర‌న్స్ గేట్/ ఎన్‌సీసీ
* బేగంపేట కుంద‌న్‌బాగ్‌, ఆరాంగ‌డ్ జంక్ష‌న్‌, నెక్నంపూర్‌
* కృష్ణ‌కాంత్ పార్క్‌, నారాయ‌ణ గూడ పార్క్, భార‌తీయ విద్యాభ‌వ‌న్ సైనిక్‌పురి, వాయుపురి