రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. వినాయక చవితి ఉత్సవాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా రుసుముల భారం మోపిందంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించింది.
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశుడి మండపాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ జవహర్ లాల్ తేల్చి చెప్పారు. వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందని జవహర్ లాల్ పేర్కొన్నారు. అయితే మండపాల ఏర్పాటుకు మాత్రం స్థానిక పోలీసులు రెవెన్యూ ల నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు ఎవరైనా రుసుములు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.