వినాయకచవితి 2022: ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు హైలెట్స్ ఇవే..!

-

శివుడు పార్వతిల కుమారుడైన వినాయకుడి పుట్టిన రోజు సందర్భంగా వినాయక చవితి మనం ఎంతో ఇష్టంగా జరుపుకుంటాము. ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. భాద్రపద శుక్ల చతుర్థినాడు గణేష్ ఉత్సవాలు మొదలవుతాయి. ఈ సంవత్సరం ఆగస్టు 31 న వినాయక చవితి వచ్చింది.

వినాయక చవితి నాడు వినాయకుడికి అలంకరణ చేసి 21 రకాల పత్రులతో పూజలు చేస్తారు అలానే కుడుములు ఉండ్రాళ్లు మొదలైన ప్రసాదాలను నైవేద్యంగా అర్పిస్తారు. అయితే అనేక ప్రాంతాలలో వినాయకుడికి ఉత్సవాలు జరుపుతారు.

వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ ఎంత స్పెషల్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖైరతాబాద్ వినాయకుడిని ఎంతో స్పెషల్ గా తయారు చేస్తారు. పైగా పొడవైన విగ్రహాన్ని ఖైరతాబాద్లో పెడతారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ హైలెట్స్ ఏమిటో మరి చూద్దాం.

ఈ సంవత్సరం శ్రీ పంచముఖి లక్ష్మీ గణపతి రూపంలో వినాయకుడు దర్శనమివ్వనున్నారు. 60 ఏళ్లలో మొట్టమొదటిసారి ఈ వినాయకుడిని మట్టితో తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని 150 మంది కళాకారులు కలిపి తయారు చేశారు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తుతో వినాయకుడు ఉండనున్నారు. వినాయకుడికి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీ దేవి ఉన్నారు. ఈ విగ్రహం కోసం కోటి 50 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news