దేవాలయంలో స్తంభాల ఎందుకు వాటి విశేషాలు మీకు తెలుసా ?

-

దేవాలయానికి పోనివారు ఉండరు. కానీ దేవాలయంలో ప్రవేశించనప్పటి నుంచి లోపలి మూలవిరాట్టు వరకు అనేక రకమైనవి ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న ఆగమ రహస్యాలు, అసలు వాటిని ఎందుకు పెడుతారులాంటివి పెద్దగా పట్టించుకోరు. ఆలాంటి వాటిలో దేవాలయంలోని వివిధ రకాల స్తంభాలు, వాటి వెనుక ఉన్న విశేషాలు తెలుసుకుందాం….

ఆలయంలో ధ్వజస్తంభం మాత్రమే కాకుండా ఇంకా అనేక స్తంభాలు కనిపిస్తాయి. అటువంటి వాటిలో రాతితో నిర్మించి పైన దీపం ఏర్పాటు చేస్తే దాన్ని దీపస్తంభం అంటారు. ఉత్తరాది ఆలయాల్లో చెట్టుకు కొమ్మలున్నట్లు ఒక స్తంభానికి వందకు పైగా దీపాలను అమర్చే దీపస్తంభం ప్రతీ గుడిలో ఉంటుంది. విశేష పండుగలప్పుడు భక్తులు దీపాల్ని వెలిగిస్తారు. ఒక రాతిస్తంభం పైన చిన్న గూడు చేసి అందులో నంది ఉంచితే దాన్ని నందిస్తంభం అంటారు. ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాగే విష్ణ్వాలయంలో రెండు చేతులూ జోడించి నిలుచున్న గరుడవిగ్రహం పైనగానీ స్తంభం మొదల్లో గానీ ఉంచితే దాన్ని గరుడస్తంభం అంటారు. ఇంకా శూలం వంటి ఆయుధాన్ని నాటి ఏర్పాటు చేసే శూలస్తంభం… పశువుల్ని మొక్కుకుని ఆలయానికి సమర్పించేప్పుడు వాటిని కట్టే యూపస్తంభం… రాజులు, చక్రవర్తులు విజయాన్ని సాధించి, రాజ్యాలను జయించినప్పుడు నాటే విజయస్తంభాలు.

కొన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. సింహాచలంలో కప్పస్తంభం… హంపిలోని సప్తస్వరస్తంభాలు… తిరుమలలోని వరాహ స్తంభం ఇలా చాలా స్తంభాలు విశేషమైనవి. జైన బసదుల్లో ఉండే స్తంభాన్ని మానస్తంభం అంటారు. అక్కడే ఉండే మరోస్తంభాన్ని బ్రహ్మస్తంభం అని కూడా పిలుస్తారు. ఈ స్తంభాలను దర్శించినా… తాకినా… వీటి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా…మొక్కుకున్నా… అనుకున్న పనులు నెరవేరుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడుండే ఆయా రకాల స్తంభాలను చూసి వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోండి. వాటి వల్ల ప్రయోజ నాన్ని పొందండి.

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news