రాజకీయ పార్టీలకు మీడియా సహకరించడం అనేది కొత్త కాదు. అనుకూలంగా ఉండే పత్రికలూ, చానల్స్ రాజకీయ పార్టీలకు మద్దతు పరోక్షంగా అందిస్తూ ఉంటాయి. ఇది కొన్ని పార్టీలకు కలిసి వస్తే మరికొన్ని పార్టీలకు ఇబ్బందికర౦గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని వాళ్లకు అనుకూలంగా మీడియా అల్లరి చేయడం ఆందోళన కలిగించే అంశం. స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడటానికి మీడియా కూడా కారణమని భావిస్తున్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా పదే పదే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వైసీపీ వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని సదరు మీడియా ప్రజల్లోకి బలంగానే తీసుకుని వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. దీనితో అధికార పార్టీ విమర్శలు చేయడానికి అన్ని విధాలుగా మార్గం దొరుకుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న గొడవను కూడా పెద్దగా చేసి చూపిస్తుంది మీడియా.
ఎన్నికల సంఘం అధికారుల తీరుని పోలీసు అధికారుల తీరుని పదే పదే తప్పుబడుతూ వస్తుంది. దీని కారణంగా అదికార పార్టీకి లాభం చేకూరుతుంది గాని ప్రజల్లోకి వెళ్ళే అంశాలు అంటూ ఏమీ కనపడటం లేదు. మాచర్ల ఘటనకు జగన్ కు లింక్ పెట్టింది. దీనితో టీడీపీ మరింత అల్లరి అయింది. జగన్ చెప్పడం వలనే… టీడీపీ నేతలపై కిషోర్ అనే వ్యక్తి దాడి చేసారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా మారింది.
ఇక ఎన్నికల సంఘం మీద టీడీపీ అనవసర విమర్శలు ముందు చేసింది. ఎన్నికల సంఘం వాయిదా వేసిన తర్వాత కొనియాడటం మొదలుపెట్టింది. దీనితో టీడీపీ కార్యకర్తల్లో కూడా పార్టీని చులకన చేసింది అనుకూల మీడియా. దీని వలన వచ్చిన లాభం ఏమీ లేకపోయినా ప్రజల్లోకి మాత్రం మీడియా చేసిన అల్లరి బాగా వెళ్ళింది. ఈ తీరు మారకపోతే మాత్రం పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడటం ఖాయమని అంటున్నారు.