ఆదివారం సూర్యనారాయణ మూర్తికి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు…!

Join Our Community
follow manalokam on social media

ఆదివారం సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. కనుక ప్రతి ఆదివారం సూర్య భగవానుడుని పూజించండి. నవగ్రహాల కి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి అధిపతి సూర్యుడు. కనుక సూర్యున్ని పూజిస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా ఎటువంటి ఇబ్బంది కలిగిన సూర్యుని ఆరాధిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ జాతక చక్రం లో రవి అనుగ్రహం లేకపోతే మీ తండ్రి తో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. రవి స్థానం బలపడాలి అంటే ప్రతిరోజు ఆరాధించాలి.

రవి స్థానం బలపడాలి అంటే ఆదివారం నాడు ఉదయాన్నే లేచి దీపం వెలిగించి, నిత్యం చేసే పూజల తో పాటు ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం లాంటి శ్లోకాలను పఠించాలి. ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి. రాత్రిపూట గోధుమ రవ్వతో చేసిన ఏ పదార్థం అయినా సూర్యునికి నైవేద్యం చేసి అప్పుడు భుజించాలి.

సూర్యుడు కి గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులు అంటే ఎంతో ఇష్టం. అందుబాటులో ఉంటే వీటితో పూజించండి. నైవేద్యానికి పండ్లు, కొబ్బరికాయ తో పాటు పరవాన్నం లేక గోదుమ రవ్వ తో చేసిన పదార్థాన్ని సమర్పించండి. బెల్లం, బియ్యం, ఆవునెయ్యి మరియు ఆవు పాలు తో చేసిన పరవాన్నం సూర్యునికి మక్కువ. సూర్యుని పటం ఇంట్లో ఉండకూడదు అని అందరూ భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. ఏ లోహంతోనైనా సూర్యుని విగ్రహం కానీ పటం కానీ ఇంట్లో ఉండవచ్చు. ఆదివారం రోజు సూర్యుని దేవాలయాన్ని సందర్శించిన వారికి కూడా మంచి ఫలితం దక్కుతుంది. సూర్య దేవాలయం సమీపంలో లేకపోతే విష్ణు మూర్తి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...