
యాలాల మండల పరిధిలో అంగన్వాడీ టీచర్ శివలీల ఆత్మహత్య చేసుకుంది. జుంటుపల్లి ప్రాజెక్టు కుడి కాలువ సమీపంలో నీళ్లలోకి దూకి టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.