ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడ సమ్మె వరకు వచ్చింది. ఉద్యోగ సంఘాలు కాసేపటి క్రితమే సమ్మె నోటీసులు కూడా ఇచ్చింది. వచ్చె నెల 7వ తేదీ నుంచి సమ్మె చేయడానికి ఉద్యోగ సంఘాలు సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ రోజు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చానా.. చర్చలు జరుపతామని తెలిపారు. రేపు మరోసారి చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమాచారం అందిస్తామని తెలిపారు.
అలాగే ప్రభుత్వం అంటే.. ఉద్యోగులు కూడా ఒక భాగం అని అన్నారు. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. అలాగే ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నాయకులను బుజ్జగించేందుకు, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రయత్నం చేస్తుందని ప్రకటించారు. అప్పటి వరకు ఉద్యోగ సంఘాలు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో రేపు మరోసారి చర్చలు జరపడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని తెలిపారు.