చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా శివారులో గల రెడ్డి బాయి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. షిఫ్ట్ డిజైర్ కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుందని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. వాహనం సీజ్ చేసి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.