తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యంగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయాన్ని యాగ స్థలాన్ని ఆలయ పరిసరాలను తికిస్తున్నారు సీఎం. కొద్ది సేపటి క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు. స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వాదం అందించారు ఆలయ అర్చకులు.
సీఎం కేసీఆర్ తొలుత హెలికాప్టర్‌లో యాదాద్రి ఆలయం చుట్టూ రెండు రౌండ్లు ప్రదక్షణ చేశారు. యాదాద్రి ఆలయం పనుల్లో పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన ఆలయం, యాగస్థలం, కోనేరు, రోడ్లను పరిశీలించారు.మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి వస్తున్నాడని నిన్న ప్రకటించడంతో ఇవాళ ఉదయం నుంచే యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.