భగవంతుడు అంతటా ఉండలేక తన రూపంలో మహిళను సృష్టించాడని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే కాదని, ప్రతి రోజూ మహిళా రోజే అన్నారు. మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని కొనియాడారు