సినీ అవకాశాల పేరుతో రంగారెడ్డి జిల్లావాసికి కుచ్చుటోపి

-

సినిమాలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసం చేసిన నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వైజాగ్ గాజువాక వాసి సునీల్‌కుమార్ కొంత కాలం క్రితం సినిమాలో అవకాశాల కోసం డబ్బులు చెల్లించి మోసపోయాడు. ఆ దారిలోనే డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో సోషల్‌మీడియాలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు వాసి సాయికుమార్‌ను నమ్మించి రూ.91,420 వసూలు చేయగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news