జగిత్యాల: భూ తగాదాల కారణంగా సొంత బావను దారుణంగా హతమార్చిన ఘటన అర్బన్ మండలం అంబారీ పేటలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్ మండలం పొలాసకు చెందిన శంకరయ్యను అతని బావ మరిది వెంకటేష్ పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో హత్య జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.